News March 13, 2025
పుష్ప 2 తొక్కిసలాట: ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే..

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతిని మాటలు అర్థం చేసుకోలేక, కుటుంబీకులను గుర్తించలేకపోతున్నాడు. స్పర్శ కూడా తెలియడం లేదని డాక్టర్లు చెప్పారని BBC కథనంలో పేర్కొంది. నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్ట్రోమీ ప్రక్రియతో ఆస్పత్రి సిబ్బంది ఆహారం పంపిస్తున్నారు.
Similar News
News March 13, 2025
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in
News March 13, 2025
కొత్త రేషన్ కార్డులపై UPDATE

TG: రేషన్ కార్డులను క్యూ ఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాటితో పాటు పాత వాటికి Qr కోడ్ ఇవ్వనుంది. 1.20 కోట్ల కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 760 మైక్రాన్స్ మందం, 85.4mm పొడవు, 54mm వెడల్పు ఉండే ఈ కార్డులపై నంబర్, కుటుంబ పెద్ద పేరు, ఫొటో, ఇతర వివరాలు ఉంటాయి. నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.
News March 13, 2025
రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి

AP: తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయంలో మొల్ల జయంతిని నిర్వహించాలని పేర్కొంది. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతానికి చెందిన మొల్ల 16వ శతాబ్దపు కవయిత్రి. మొల్ల రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందింది.