News March 13, 2025
వికారాబాద్: BAC సమావేశం నిర్వహించిన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరి కమిటీ (BAC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య, హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.
Similar News
News March 19, 2026
ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.
News March 19, 2026
అమలాపురం: కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి మమ్మీ పేర్కొన్నారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులను అధికారులు అధికారికంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
News March 19, 2026
సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.


