News March 13, 2025

HYDను దేశ 2వ రాజధాని చేయాలని డిమాండ్

image

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని VCK రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన అధ్యక్షతన బుధవారం బాగ్‌లింగంపల్లిలోని SVKలో ‘దక్షిణాది MP సీట్లు పెంపు-దక్షిణాది హక్కు’ పై వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని, HYDను దేశానికి 2వ రాజధానిగా చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News March 10, 2026

ANU: రేపటి నుంచి BED ప్రయోగ పరీక్షలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బుధవారం నుంచి BED మొదటి విడత ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతాయని PG, వృత్తి విద్య కోర్సుల సమన్వయకర్త సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఇవి 13 వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతాయని చెప్పారు. మొత్తం 17కళాశాలల విద్యార్థులకు దగ్గరలోని పాఠశాలల్లో ప్రయోగ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 10, 2026

కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News March 10, 2026

చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

image

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.