News March 13, 2025

అచ్చంపేట: చెంచుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

అమ్రాబాద్ నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉన్న చెంచుగూడెంలలో చేపట్టాల్సిన కనీస మౌలిక సదుపాయాల గురించి బుధవారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ దోమల పెంటలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నల్లమలకు రానున్న సందర్భంగా చేపట్టాల్సిన పనుల గురించి డీఎఫ్ఓతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెంచుగూడెంలో తాగినూరు రోడ్లు విద్య వైద్యం గురించి చర్చించారు.

Similar News

News March 23, 2026

గుంటూరులో పబ్లిక్ సర్వే గణాంకాలపై అనుమానాలు

image

గుంటూరు జిల్లాలో పబ్లిక్ పర్సెప్షన్ సర్వే గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విభాగాలు చూపిస్తున్న సంఖ్యలు క్షేత్రస్థాయిలో సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. మార్గదర్శకుల సంఖ్య, రైతు సేవలు వంటి అంశాల్లో వాస్తవ పురోగతి తక్కువగా ఉందని తేలింది. కొన్ని పథకాల అమలు గణాంకాలు అతిశయంగా చూపించినట్లు వెల్లడైంది. రైతుల ఫిర్యాదుల నమోదు కూడా తక్కువగా ఉండటం గమనార్హం.

News March 23, 2026

భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటీ వివాదం?

image

TG: భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మది గౌతమస గోత్రంగా వ్యవహరించేవారు. 2012 తర్వాత అక్కడ ఉన్నది రామనారాయణుడంటూ గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పండితులు చదువుతున్నారంటూ ఓ వ్యక్తి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏర్పాటుచేసిన కమిటీ 2024లో దేవదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అది బయటికి రాకపోవడంతో మళ్లీ కోర్టుకెక్కారు. ఇవాళ విచారణ జరగనుంది.

News March 23, 2026

HYD: బడ్జెట్ రిప్లైలో నేడు అసెంబ్లీలో హరీశ్‌రావు ప్రసంగం

image

బడ్జెట్ రిప్లైలో భాగంగా నేడు అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మాట్లాడనున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో లోటుపాట్లు, 6 గ్యారంటీలకు నిధుల లేమి, అన్ని వర్గాలకు మోసం చేసిన కాంగ్రెస్ తీరు, విపరీత, అనాలోచిత నిర్ణయాలతో మందగించిన ఆర్థిక వృద్ధి, నిలిచిపోయిన సంక్షేమం, తదితర అంశాలపై పూర్తి ఆధారాలు గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు.