News March 13, 2025

మహబూబాబాద్: అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా ఆరేళ్లి శ్రీనివాస్

image

మహబూబాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గత 19 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా శ్రీనివాస్ మంచి పేరు సాధించారు. అనంతారం గ్రామానికి చెందిన ఆరెల్లి రాజయ్యగౌడ్-సోమక్క దంపతుల కుమారుడు శ్రీనివాస్ ఏజీపీగా నియామకం కావడంతో జిల్లా వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 19, 2026

రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

image

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News March 19, 2026

సంస్కృతికి ప్రతీక ఉగాది పచ్చడి: ఎస్పీ

image

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాన్ని SP రాజేష్ చంద్ర, ఇతర పోలీస్ అధికారులు ఆలకించారు. కార్యక్రమం అనంతరం SP స్వయంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి అనేది కేవలం ఆరు రుచుల మిశ్రమం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతికి, జీవిత సత్యాలకు ప్రతీక అని SP పేర్కొన్నారు.

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.