News March 13, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఈనెల 15 నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ముందు రోజు రాత్రి ఆయా మండలాలకు వెళ్లి రాత్రి బస చేయాలన్నారు.

Similar News

News March 22, 2026

బల్బ్‌లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

image

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక డాక్టర్ తన కొలీగ్‌పై ఉన్న వన్ సైడ్ లవ్‌తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్‌లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.

News March 22, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 22, 2026

రంజాన్ వేళ ‘గులాబీ’ సంకేతం.. జీవన్‌రెడ్డి అడుగులు అటువైపేనా?

image

మాజీమంత్రి జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై సాగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శనివారం జగిత్యాలలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ ZP చైర్మన్ దావ వసంత సహా పలువురు BRS ముఖ్య నేతలతో కలిసి ఆయన ఒకే వేదికపై కనిపించారు. కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నేడు ప్రత్యర్థి పార్టీ నేతలతో ఆత్మీయంగా గడపడం ‘కారు’ ఎక్కబోతున్నారనే సంకేతాలను స్పష్టం చేస్తోంది.