News March 13, 2025
10th పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 17వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీఎస్ విజయానంద్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు ఎస్పీ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News September 12, 2025
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు విద్యార్థి

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి టి. చంద్రశేఖర్ ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పి. వెంకటలక్ష్మి తెలిపారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చంద్రశేఖర్ 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, పీడీ ఓబయ, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News September 11, 2025
చాపాడు: మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు చాపాడు మండల నరహరిపురం పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమిలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ఐ (మాల్కంబీ) క్రీడలలో జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు అండర్ 17 విభాగంలో వి. సుబ్బలక్ష్మి (10వ తరగతి), కె. మస్తాన్ వల్లి (9వ తరగతి) ఎంపిక అయ్యారని తెలిపారు.
News September 11, 2025
ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.