News March 13, 2025

కడప: ‘మౌలిక సదుపాయాలు కల్పించాలి’

image

కడప జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన జగనన్న కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగర శివారులోని జగనన్న కాలనీలను ఆయన ఈరోజు పరిశీలించారు. కనీసం ప్రజలు తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవడం నిజంగా దారుణం అన్నారు. రోడ్లు డ్రైనేజీ నీటి సదుపాయం కల్పించాలని కోరారు.

Similar News

News March 23, 2026

తాళ్ల ప్రొద్దుటూరులో ఆరుగురి అరెస్ట్

image

కొండాపురం మండలం ఉస్తికాయలపల్లిలో అక్రమంగా జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SI మంజునాథ తెలిపారు. జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం మధ్యాహ్నం దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.13,020 నగదుతో పాటు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.