News March 13, 2025
వైద్య సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు: కలెక్టర్

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్‌లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
Similar News
News January 14, 2026
నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.
News January 13, 2026
నల్గొండ: పాఠశాల నిర్మాణ పనుల తనిఖీ

వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్ బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్‌బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
News January 13, 2026
రైతన్నకు తప్పని ‘యూరియా’ కష్టాలు

జిల్లాలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. కేవలం PACS, మన గ్రోమోర్ కేంద్రాల్లోనే స్టాక్ ఉండటం, ప్రైవేటు డీలర్లు అమ్మకాలు నిలిపివేయడంతో యూరియా దొరకడం గగనమైంది. పొలాలకు ఎరువులు వేయాల్సిన సమయంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


