News March 13, 2025
‘శ్రీ సత్యసాయి జిల్లా మొదటి స్థానంలో ఉండాలి’

శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని వృద్ధిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీరు ఏర్పాటుచేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. రహదారి ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. దూర ప్రాంత సర్వీసులలో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
Similar News
News March 14, 2026
కడప జిల్లా: ఒక్కరోజులో 281 మందిపై కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 281 కేసులు నమోదు చేశారు. వారికి సంబంధించి రూ.53,390 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టు తప్పక ధరించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ హెచ్చరించారు.
News March 14, 2026
సంగారెడ్డి: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. జిల్లాలోని 123 కేంద్రాల వద్ద ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం, ర్యాలీలు, సభలు, మైకులు వాడటం నిషిద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 14, 2026
KNR: కనుమరుగవుతున్న జానపద కళ.. ‘వీధి నాటకం’ గత వైభవమేనా?

ఒకప్పుడు పల్లెల్లో వినోదానికి, విజ్ఞానానికి చిరునామాగా నిలిచిన వీధి నాటకాలు నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. సినిమా తారలు లేకపోయినా, భారీ సెట్టింగులు లేకపోయినా.. కేవలం గొంతులో ఉన్న సత్తాతో, కాళ్ల గజ్జెల సవ్వడితో జనాన్ని కట్టిపడేసిన ఈ జానపద కళ ఆధునిక పోకడల మధ్య నలిగిపోతోంది. జానపద కళను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కళాకారులదే కాదు, ప్రభుత్వం, సమాజంపై కూడా ఉంది.


