News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
ఈ అలవాట్లతో డేంజర్!

జీవనశైలిలో చేసే కొన్ని పొరపాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘6 గంటల కంటే తక్కువ నిద్ర, గంటల తరబడి కూర్చోవడం, రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, BP/షుగర్ కంట్రోల్‌లో లేకపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. గురకను నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ రావొచ్చు. వీటి వల్ల మెదడు వయసు పెరుగుతుంది’ అని చెబుతున్నారు.
News February 24, 2026
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..

వయస్సు, లైఫ్ స్టైల్ బట్టి మన శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే జబ్బులను పట్టుకోవడానికి ఈ 5 ప్రత్యేక పరీక్షలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. HbA1c టెస్ట్ (HbA1c – మూడు నెలల షుగర్ లెవల్స్), విటమిన్ డి, బి12 పరీక్ష, కార్డియాక్ కాల్షియం స్కోర్, సాధారణ కొలెస్ట్రాల్ పరీక్ష కంటే ApoB పరీక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేస్తుంది. వీటితో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించడం కూడా చాలా ముఖ్యం.
News February 24, 2026
అష్టలక్ష్మి: విజయలక్ష్మి దేవిని ఎలా పూజించాలంటే?

విజయలక్ష్మి దేవి పూజలో ఎరుపు వస్త్రాలు, పూలను వాడాలి. విజయలక్ష్మి అంటే చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇచ్చే దేవత. ఎరుపు రంగు ఉత్తేజానికి, ఉత్సాహానికి చిహ్నం. శత్రువులపై విజయం సాధించాలన్నా లేదా చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి కావాలన్నా ఈ దేవిని ఎరుపు రంగుతో ఆరాధించాలి. పోటీ పరీక్షలు రాసేవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు విజయలక్ష్మిని ఇలా పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు పొంది, జయం చేకూరుతుంది.


