News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

రేపు విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో, సీపీ, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News September 14, 2025

సృష్టి కేసులో విశాఖలో సిట్ తనిఖీలు

image

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సృష్టి కేసులో విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం
తనిఖీలు చేపట్టారు. నగరంలోని సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలో రాత్రి 12:00 వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి తనిఖీలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేజీహెచ్ డాక్టర్లు ముగ్గురు సస్పెండ్ కాగా మిగతావారి పాత్ర తేలాల్సి ఉంది.

News September 13, 2025

విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

image

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.