News March 13, 2025

HNK: గురుకులాల్లో నాణ్యమైన భోజనంపై దృష్టిని పెట్టాలి: కలెక్టర్

image

గురుకులాల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ బాగుండే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, కస్తూరిబా విద్యాలాయాల్లో ఫుడ్ సేఫ్టీ, వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News March 28, 2026

VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.

News March 28, 2026

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌తో  ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8639846568 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

News March 28, 2026

వరంగల్: ఎటు పోయాయో ఆ పల్లె జ్ఞాపకాలు..!

image

ఒకప్పుడు వేసవి వస్తే ఓరుగల్లు పల్లెలు చుట్టాలతో కళకళలాడేవి. పొలంకాడి చింత చెట్టు కాయలు తెంపి, ఇసుర్రాయిపై పొయ్యి గొట్టంతో గింజలు తీస్తూ ముచ్చటించుకునే ఆ రోజులు ఇప్పుడు కలగా మారాయి. మోదుగు ఆకులతో ఇస్తార్లు కుట్టడం, మట్టి పొయ్యిలు, నులక మంచాలు యాంత్రీకరణలో కొట్టుకుపోయాయి. నాటి బాల్యం ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. పట్నంలో పని చేస్తూ నాటి మధుర జ్ఞాపకాలను మీరు మిస్ అవుతున్నారా? కామెంట్ చేయండి.
SHARE