News March 13, 2025
అవకాశమిస్తే రీఎంట్రీకి సిద్ధం: పుజారా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెస్టు స్పెషలిస్ట్ పుజారా హింట్ ఇచ్చారు. జట్టుకు అవసరమైతే తాను ఆడేందుకు సిద్ధమని చెప్పారు. కొన్నేళ్లుగా డొమెస్టిక్, కౌంటీల్లో భారీగా పరుగులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పుజారాను తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తోంది. 2023 WTC ఫైనల్ పుజారాకు ఆఖరు మ్యాచ్.
Similar News
News January 15, 2026
ఏడాదికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం

ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తున్నారు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు పొడిని సేకరిస్తారు. kg సగటున రూ.140 చొప్పున ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు, ఎరువుల కంపెనీలకు విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ.500కు అమ్ముతారు. ఏడాదికి మునక్కాయలు, పొడి నుంచి 10 ఎకరాలకు రూ.40 లక్షల ఆదాయం పొందే స్థాయికి ఎదిగారు.
News January 15, 2026
సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.
News January 15, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

<


