News March 13, 2025

సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

image

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.

Similar News

News July 6, 2025

భక్తుల కొంగు బంగారం.. కొమ్మాల

image

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. మిగతా రోజుల్లోనూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడి రైతులు తొలి పంటను స్వామివారికి అందిస్తుంటారు.

News July 6, 2025

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

image

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.

News July 6, 2025

జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

image

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు.