News March 13, 2025
నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 13, 2025
అమెరికా మాజీ అధ్యక్షుడి నిర్మాణంలో ‘టైగర్ వుడ్స్’ బయోపిక్

స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
News March 13, 2025
‘జన్మభూమి’ ఇక సికింద్రాబాద్‌లో ఆగదు! వివరాలివే

విశాఖ-లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆగదు. దాని ప్రయాణమార్గాన్ని మళ్లిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన లింగంపల్లి నుంచి చర్లపల్లి-అమ్ముగూడ-సనత్ నగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లవైపు వెళ్లదని, ప్రయాణికులు గుర్తుంచుకోవాలని కోరింది.
News March 13, 2025
బేర్స్ గ్రిప్‌లోకి Nifty IT: రూ.8.4లక్షల కోట్ల నష్టం

దేశీయ ఐటీ సూచీ బేర్స్ గ్రిప్‌లోకి జారిపోయింది. 2024, DEC 4న 45,995 వద్ద NiftyIT సూచీ ప్రస్తుతం 36,271 స్థాయికి చేరింది. 62 సెషన్లలోనే ఏకంగా 10,200 pts (22%) పతనమైంది. దీంతో ఈ ఒక్క రంగంలోనే రూ.8.4లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. TCS రూ.3.79లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.1.69లక్షల కోట్లు, HCL TECH రూ.1.21లక్షల కోట్ల మేర నష్టపోయాయి. సాధారణంగా ఏ సూచీ అయినా 20% పతనమైతే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు.