News March 13, 2025
HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 13, 2025
మహిళా ఎస్సైపై దాడి చేసిన ఆకతాయిలు

AP: విజయనగరం జిల్లాలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై ఆకతాయిలు దాడి చేశారు. వేపాడ మండలంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసభ్యంగా డాన్స్ చేశారు. దీనిని మహిళా ఎస్సై అడ్డుకోవడంతో ఆమెను జుట్టు పట్టుకొని లాగారు. అనంతరం ఆమెపై దాడిచేసి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. మహిళా ఎస్సైని ఆసుపత్రికి తరలించారు
News March 13, 2025
భువనగిరి: పీఎం శ్రీ పథకం ఎంతో ప్రయోజనకరం

యాదాద్రి జిల్లాలో పీఎం శ్రీ పథకానికి మొదటి విడతలో 17 పాఠశాలలకు, రెండో విడతలో 8 పాఠశాలలకు చోటు దక్కింది. విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.
News March 13, 2025
దేవీపట్నం: పెళ్లి రోజే ఆమెకు చివరిరోజు

దేవీపట్నం మండలం దేవారం గ్రామానికి చెందిన కె. శ్రీదేవి(45) పెళ్లిరోజే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీదేవి అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ కృష్ణునిపాలెంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. బుధవారం 25వ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.