News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 13, 2025
హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News March 13, 2025
రిషభ్ పంత్ చెల్లెలి పెళ్లి.. PHOTO

భారత క్రికెటర్ రిషభ్ పంత్ చెల్లెలి వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్సోరిలోని లగ్జరీ హోటల్లో సాక్షి, లండన్ వ్యాపారవేత్త అంకిత్ చౌదరి పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకకు ధోనీ, రైనా, పృథ్వీ షా, నితీశ్ రాణా, పలువురు నటులు హాజరయ్యారు.
News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.