News March 13, 2025

సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరీ జిల్లా ప్రజలకు తెలిపారు. బుదవారం బుధవారం జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, ఎంపీడీవో, ఔట్ యజమానులతో అందరితో నిర్వహించిన ఎల్ఆర్ఎస్-2020 పైన అవగాహన కల్పించారు.

Similar News

News March 16, 2026

ఎప్‌స్టీన్‌‌ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

image

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్‌ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.

News March 16, 2026

విశాఖ: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు 397 విన‌తులు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గ‌డువులోగా ప‌రిష్కారం చూప‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై సాధార‌ణ పీజీఆర్ఎస్‌కు 397 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్‌కు 119, జీవీఎంసీకి చెందిన‌వి 94, పోలీసు 26, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 158 విన‌తులు ఉన్నాయి.

News March 16, 2026

అర్జీలు.. త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ

image

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎస్పీ కృష్ణారావు స్వయంగా బాధితుల నుంచి 88 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.