News March 13, 2025
సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
హిందూపురం బ్యాంకు దోపిడీ కేసు.. మరో దొంగ అరెస్ట్

హిందూపురంలోని తూముకుంట SBI దోపిడీ కేసులో రెండో నిందితుడు మహమ్మద్ ఇష్రార్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సతీశ్ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన అతడి వద్ద నుంచి రూ.5.50 కోట్ల విలువైన 5,500 గ్రాముల బంగారం, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే హరియాణాకు చెందిన అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, సాంకేతిక ఆధారాలతో రెండో నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News January 1, 2026
‘స్పిరిట్’ లుక్‌పై ఫ్యాన్స్ ఖుషీ.. మీకెలా అనిపించింది!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ SMను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఫస్ట్ లుక్స్‌తో పోలిస్తే ‘స్పిరిట్’ లుక్ మరింత ఇంటెన్సివ్‌గా ఉందనే చర్చ నడుస్తోంది. ఈసారి ప్రభాస్‌ను సందీప్ సరికొత్తగా చూపించబోతున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘స్పిరిట్’ లుక్ ఎలా ఉంది? COMMENT
News January 1, 2026
తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.


