News March 13, 2025

మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.

Similar News

News March 13, 2025

రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

image

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్‌గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.

News March 13, 2025

HNK: యూత్ కాంగ్రెస్ ఇంచార్జులుగా రాహుల్, అశ్విన్ రాథోడ్

image

HNK జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జులుగా రాహుల్, అశ్విన్ రాథోడ్ నియమితులయ్యారు. యూత్ కాంగ్రెస్ ఇన్‌‌ఛార్జులుగా నియమితులైన వారికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు.

News March 13, 2025

యాదాద్రి: ట్యాంకర్లతో పొలాలు తడుపుతున్నారు

image

భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలు తడుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేసి పంట పొలాలను తడుపుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. 

error: Content is protected !!