News March 13, 2025

నాని సవాల్‌.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

image

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News March 13, 2025

‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌‌’ను AIగా ప్రచారం చేస్తున్నారు: నారాయణ మూర్తి

image

దేశంలో కొన్ని కంపెనీలు ‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌’ను AIగా ప్రచారం చేస్తున్నాయని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ప్రతి దానికీ AIతో ముడిపెడుతూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ‘AIలో 2 ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒకటి మెషీన్ లెర్నింగ్. ఇది ప్రిడిక్ట్ చేయడానికి లార్జ్ డేటా కావాలి. రెండోది డీప్ లెర్నింగ్. మెదడు పనితీరును అనుకరిస్తుంది. పర్యవేక్షణ లేని ఆల్గారిథమ్స్‌ను పరిష్కరిస్తుంది’అని వివరించారు.

News March 13, 2025

మే 9న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్?

image

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈనెల 28న విడుదలయ్యే అవకాశం లేదని సినీవర్గాలు తెలిపాయి. దీంతో రిలీజ్‌ను మే నెలకు వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. మే 9న HHVM విడుదల కానున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News March 13, 2025

టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

image

AP: టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్‌లో ఉన్న 365,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.

error: Content is protected !!