News March 13, 2025

నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

Similar News

News March 7, 2026

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

image

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.

News March 7, 2026

పెరిగిన ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజులు

image

TG: ప్రైవేటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-28 విద్యాసంవత్సరానికి బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37లక్షలుగా నిర్ధారించింది. గతంతో పోలిస్తే 10-15% పెరిగింది. కనిష్ఠ ఫీజును రూ.45వేలకు పరిమితం చేసింది. అయితే మెజార్టీ కాలేజీల్లో ఫీజులు రూ.50-80వేల మధ్య ఉన్నాయి. ఇక ఆర్కిటెక్చర్ ఫీజును గరిష్ఠంగా ₹1.32లక్షలుగా సర్కార్ నిర్ణయించింది.

News March 7, 2026

టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

image

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.