News March 13, 2025

సిద్దిపేట: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ల పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.

Similar News

News April 17, 2026

హుకుంపేట: ఎన్డీపీఎస్ కేసులో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష

image

హుకుంపేట పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులో ఏ1 నిందితుడు విజయసాయికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1లక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 15న 462 కిలోల గంజాయి రవాణా చేస్తూ విజయసాయి పట్టుబడినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసుపై గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు విచారణ జరిగిందన్నారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

News April 17, 2026

స్వీయ గణనలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో నిర్ణీత పోర్టల్ ద్వారా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ విధానం పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె కోరారు.

News April 17, 2026

పెంచలకోన ఆలయానికి రూ.6.50 కోట్లు

image

పెంచలకోన శ్రీఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ.6.50 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల తర్వాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విజ్ఞప్తి మేరకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపైనా ఆగమ పండితుల సూచనలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.