News March 13, 2025
పెబ్బేరు: దరఖాస్తు గడువు పెంపు: నరేష్ కుమార్

పెబ్బేరు ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందన్నారు.
Similar News
News March 11, 2026
మోదీ పాలనలో క్యూలే మిగిలాయి: కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ హయాంలో దేశ ప్రజలు నిరంతరం లైన్లలోనే గడపాల్సి వస్తోందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 2016 నోట్ల రద్దు సమయంలో ATMల వద్ద పడ్డ కష్టాలు, కరోనా సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కోసం, ప్రస్తుతం వంట గ్యాస్ (LPG) కోసం క్యూ కట్టడాన్ని ఎత్తిచూపింది. మోదీ పాలనలో కేవలం క్యూలే మిగిలాయని సెటైరికల్ ట్వీట్ చేసింది.
News March 11, 2026
రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
News March 11, 2026
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మరోసారి దాడి చేసింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న భారతీయుడు సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విమానాశ్రయం నుంచి భారీగా పొగ వెలువడుతోంది. మరోవైపు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. తమపై దాడి చేస్తున్న US-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.


