News March 13, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.
Similar News
News March 17, 2026
GWL: కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి

కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కేజీబీవీలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా ఎవరిని పాఠశాలలోకి అనుమతించరాదన్నారు. విద్యార్థుల సంక్షేమం, భద్రతపై ప్రిన్సిపాళ్లు దృష్టి పెట్టాలన్నారు.
News March 17, 2026
HNK: కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లకు ఊరట

అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా ఛార్జీల విధింపులో ఊరట లభించిందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు. నూతన విధానంతో ఈ కేటగిరిలో మార్కులు జరిగాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం ఉండదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే ఉంటుందన్నారు.
News March 17, 2026
ఉపాధి హామీ చట్టంపై నీలినీడలు: వైఎస్ షర్మిల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వీబీజీ రాంజీ చట్టం వల్ల ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్ల పరమవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అరకులోయ మండలం మాడగడలో జరిగిన MGNREGA చట్టం పరిరక్షణ యాత్ర సభలో ఆమె మాట్లాడారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు 40% నిధులు భరించడం అసాధ్యమని, ఇది పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. కూలీల హక్కులను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.


