News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
Similar News
News March 13, 2025
భారత్‌కు మాత్రమే ఆ సత్తా ఉంది: స్టార్క్

భారత్‌లోని క్రికెట్ నైపుణ్యంపై ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. ‘ఒకేరోజు టెస్టు, ODI, T20 మ్యాచులు పెడితే వాటన్నింటికీ వేర్వేరు బలమైన జట్లను పంపించగల సత్తా భారత్‌కు మాత్రమే ఉంది’ అని చెప్పారు. టీమ్ఇండియా సమస్యల్ని పరిష్కరించే ఆటగాడిగా KL రాహుల్ ఉన్నారని పేర్కొన్నారు. ఓపెనింగ్, కీపింగ్, ఫీల్డింగ్, ఫినిషింగ్ ఇలా ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.
News March 13, 2025
సూపర్ ISRO: స్పేడెక్స్ అన్‌డాకింగ్ విజయవంతం

ఇస్రో అరుదైన ఘనత సాధించింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. <<15168341>>స్పేడెక్స్<<>> అన్‌డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. కొన్ని నెలల క్రితం SDX-1, SDX-2 శాటిలైట్లను వేర్వేరుగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో వాటిని సమర్థంగా (డాక్) అనుసంధానించింది. ఇన్నాళ్లూ పనితీరును పరీక్షించి తాజాగా వాటిని విడదీసింది. దీంతో భవిష్యత్తు ప్రాజెక్టులైన స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌కు మార్గం సుగమమైంది.
News March 13, 2025
పాత సామాను బయటికెళ్లాలి: రాజాసింగ్

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.