News March 13, 2025
పెద్ద కార్పాముల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో మార్చి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకార్పాములకు రాములు, స్వామిలు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందెళ్తున్న బైక్‌ని ఢీకొని కిందపడగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం రాములు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.
Similar News
News March 14, 2026
తిరుపతి: ‘సార్.. నా భార్య SIతో వెళ్లిపోయింది’

ఓ SI ప్రేమ పేరుతో తన భార్యను తీసుకెళ్లాడని తిరుపతి జిల్లా వాకాడు మండల వాసి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘ఓ కేసు విషయమై నేను, నా భార్య స్టేషన్‌కు వెళ్లాం. ఆ సమయంలో ఎస్ఐకు నా భార్య(36)తో పరిచయం ఏర్పడింది. నేను లేని సమయంలో ఎస్ఐ మా ఇంటికి వస్తున్నాడు. దీనిపై 4రోజుల క్రితం నా భార్యను నిలదీయగా తాళి నాకు ఇచ్చి ఎస్ఐతో వెళ్లిపోయింది’ అంటూ పోలీస్ ఉన్నతాధికారులకు అతను ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.
News March 14, 2026
ఎస్సీ నిరుద్యోగులకు సబ్సిడీ పథకాలు: భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులు ఈవీ 2, 3 వీలర్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోలర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. మొత్తం 276 యూనిట్లకు రూ.265.28 లక్షల సబ్సిడీతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రూ.1 లక్ష వరకు 90%, రూ.2 లక్షలకు 80%, రూ.2 నుంచి 4 లక్షల వరకు 70%, రూ.4 లక్షలపైగా 60% సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారని వెల్లడించారు.
News March 14, 2026
గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.


