News March 23, 2024
విజయనగరం: వాలంటీర్ సస్పెండ్

ఎన్నికల కోడు ఉల్లంఘనలో భాగంగా ఎల్కోట మండలం ఖాసాపేట సచివాలయం పరిధిలో క్లస్టర్-6 వాలంటీర్ బొబ్బిలి శివను తొలగించినట్లు ఎల్ కోట ఎంపీడీవో కే రూపేష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌లో రాజకీయ నాయకుల స్టేటస్లు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు పై ఇతనిపై చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న అందరికీ నిబంధన వర్తిస్తుంది అన్నారు.
Similar News
News July 7, 2025
VZM: కలెక్టరేట్‌కు 194 వినతులు

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
News July 7, 2025
VZM: నేడు చిత్రలేఖనం పోటీలు

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహిస్తున్నామని డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. నేడు మండల స్థాయిలో, ఈనెల 9న జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పొగాకు, మత్తు పదార్థాల వినియోగంపై చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు.