News March 13, 2025
NRML: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT
Similar News
News September 16, 2025
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్‌కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.
News September 16, 2025
SRCL: ‘ఓటర్ జాబితా స్పెషల్ రివిజన్ కట్టుదిట్టంగా చేపట్టాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 2022 సం. ఓటర్ల జాబితాతో తాజా జాబితాను పోల్చి, డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ధృవీకరణ చేసి, సెప్టెంబర్ 22లోపు జాబితా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
News September 16, 2025
దసరా పండగకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలి: కలెక్టర్

బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా సంబరాలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ మండల ప్రత్యేక అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.