News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
News March 14, 2025
MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ <<15754802>>యువకుడు<<>> రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
IPL 2025: బుమ్రా ఎంట్రీ ఎప్పుడంటే?

ఐపీఎల్-2025 ప్రారంభంలో ముంబై ఆడే కొన్ని మ్యాచులకు బుమ్రా దూరం కానున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయన జట్టులో చేరతారని క్రీడా వర్గాలు తెలిపాయి. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా MI తన తొలి మ్యాచును మార్చి 23న CSKతో ఆడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్ టైటాన్స్, 31న KKRతో తలపడనుంది. బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.