News March 13, 2025

పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

image

పిఠాపురం(చిత్రాడ)లో రేపే జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురంలో ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్‌ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలుగా మార్చారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Similar News

News September 18, 2025

పామిడిలో తండ్రిని చంపిన కొడుకు

image

పామిడిలోని బెస్తవీధిలో తండ్రిపై కొడుకు రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో తండ్రి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై వారెంట్ జారీ..!

image

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది బొమ్మన అర్జున్ తెలిపారు. ఏమైందంటే.. మిడ్ మానేరులో ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా దీనిపై కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా వివరణ కోసం కోర్టుకూ హాజరుకాలేదు. దీంతో ఆయనపై వారెంట్ జారీ అయింది.

News September 18, 2025

మాసాయిపేట: ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలో హైవే-44పై జరిగిన <<17746368>>రోడ్డు ప్రమాద<<>> ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న UPకి చెందిన రాజ్ కుమార్ పాల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.