News March 13, 2025

మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

image

మచిలీపట్నంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న లారీ కాలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కుడి కాలు పాద భాగం నుజ్జు నుజ్జైంది. క్షతగాత్రుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News March 14, 2025

గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు 

image

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News March 14, 2025

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా భారతి

image

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా శీలం భారతి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీ మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

News March 14, 2025

కృష్ణా: ఈనెల 17 నుంచి 10th exams

image

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

error: Content is protected !!