News March 13, 2025
HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.
Similar News
News March 13, 2025
మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.
News March 13, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్‌పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 13, 2025
మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.