News March 13, 2025
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బేబీ ఫీడింగ్ సెంటర్

అనకాపల్లి, పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బాలింతలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి ప్రజా రవాణా అధికారి కె. పద్మావతి తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఓ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో బేబీ ఫీడింగ్ సెంటర్‌ను బుధవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలింతలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News April 1, 2026
కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో పీజీ (ఆర్ట్స్, సైన్స్) కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 23 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 – మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్సిటీ పరిధిలోని 5 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని KRU అధ్యాపకులు తెలిపారు.
News April 1, 2026
భద్రాద్రి: ఈనెల 7 నుంచి సదరం క్యాంపులు

భద్రాద్రి జిల్లాలో ఈనెల 7నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల కోసం సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 16 కేటగిరీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సదరం క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 7, 8, 10, 15, 17, 21, 24, 28 తేదీలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News April 1, 2026
బాపట్ల జిల్లాలో పరార్.. హైదరాబాద్‌లో పట్టివేత

నగరం మండలం కట్టావ గ్రామానికి చెందిన అల్తాఫ ఖాన్ క్రైమ్ నంబర్ 59 బార్ 2019 కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతను కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నందున NBW చేసినట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు. నిందితుడిని హైదరాబాదులో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. నిందితుడికి కోర్టు 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.


