News March 13, 2025
ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.
Similar News
News March 16, 2026
దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా మోదీ చర్యలు: చంద్రబాబు

AP: యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా PM మోదీ చర్యలు చేపడుతున్నారు. కష్టకాలంలో కుంగిపోకుండా సమష్టిగా పనిచేయాలి. అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను గుర్తు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’ అని అమరావతిలో అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
News March 16, 2026
రైతులకు ఉచితంగా యూరియా!

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.
News March 16, 2026
సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.


