News March 13, 2025
పెద్దపల్లి: గ్రూప్-1లో సత్తా చాటిన స్నేహ

పెద్దపల్లి జిల్లా పెగడపల్లి బతికపల్లి గ్రామానికి చెందిన స్నేహ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 517 మార్కులు సాధించింది. కాగా, స్నేహ ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 517 మార్కులతో 485వ ర్యాంకు సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News March 28, 2026
TU: రీవాల్యూయేషన్‌కు అప్లై చేసుకున్నారా..!

తెలంగాణ వర్సిటీ పరిధిలోని B.Ed, B.P.Ed 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎగ్జామ్ కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 4 లోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యాలు ఆ దరఖాస్తులను ఏప్రిల్ 7 లోగా వర్సిటీలో సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News March 28, 2026
పాలమూరు: వేడి గంజిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

NRPT జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సుధాబాయి, నరసింహులు దంపతుల కుమార్తె నందిని (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకొన్నాయి.
News March 28, 2026
విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం..!

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి (GGH) సాక్షిగా దారుణం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతి తన తండ్రి చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, అక్కడ పరిచయమైన అమీన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను నమ్మించి కృష్ణలంకకు తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో, వారు మాచవరం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


