News March 13, 2025
WNP: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

వీపనగండ్ల మండలంలో 18 రోజులక్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన వీరస్వామి(35) గత నెల23న శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. కొంత దూరం నడిచాక తాను నడవలేనని, ఇంటికెళ్లిపోతానని వెనుదిరిగాడు. కానీ ఇంటికి చేరలేదు. సంత్రావుపల్లి గ్రామశివారులో మృతిచెంది కనిపించాడు. ఆధార్‌కార్డు వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ మేరకు కేసునమోదైంది.
Similar News
News March 9, 2026
NZB: ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
News March 9, 2026
జగిత్యాల: ప్రజావాణి.. 56 ఫిర్యాదులు స్వీకరణ

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 9, 2026
వడదెబ్బ మృతులకు ₹4లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే?

TG: వేసవిలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు GOVT ₹4 లక్షల పరిహారం అందించనుంది. గతంలో ఇది ₹50,000 మాత్రమే. SDMA గత ఏడాది ఈ మొత్తాన్ని పెంచింది. వడదెబ్బ మరణాలను మండల స్థాయిలో రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారుల కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. కనుక ఎవరైనా వ్యక్తులు వడదెబ్బతో చనిపోయినట్లయితే తప్పనిసరిగా పోస్ట్‌మార్టం జరిపించాలి. డెత్ సర్టిఫికెట్, పంచనామా రిపోర్టు ఆధారంగా దరఖాస్తు చేయాలి.


