News March 13, 2025

పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

image

పిఠాపురం(చిత్రాడ)లో రేపi జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురం, కాకినాడ, జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్‌ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లును ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Similar News

News March 31, 2026

NTR జిల్లాలో అక్కడ వారం రోజులు మాంసం బంద్

image

చందాపురం గ్రామంలో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్లలో మాంసం నిషేధించాలని ఆదేశాలిచ్చింది. ఈనెల31 (నేడు) నుంచి ఏప్రిల్ 8 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.

News March 31, 2026

కృష్ణా: ‘ఉదయం పరీక్ష రాశాడు’..’సాయంత్రానికి శవమయ్యాడు’

image

గూడూరు(M) జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువలో సోమవారం పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం విధితమే. రాయవరం గ్రామానికి చెందిన ఉద్దంటి దేవ హర్ష (16) ప్రస్తుతం పదో తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం పరీక్ష రాసి ఇంటికి వచ్చిన హర్ష, స్నేహితులతో కలిసి సరదాగా జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువ వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 31, 2026

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై మునుగోడు రాజకీయం..!

image

మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని గతంలో ప్రకటించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, ప్రస్తుతం అధికార పార్టీ MLAగా ఉండి నియోజకవర్గం కోసం మరోసారి రాజీనామా చేయాలని BRS నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన ఇటీవల అసెంబ్లీలో మాట్లాడగా మాజీ MLA కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తేనే నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయంటున్నారు.