News March 13, 2025
ఆసక్తిగా ఆసిఫాబాద్ రాజకీయం

ASF జిల్లాలో BRS, BJP ఒక్కో MLA ఉన్నారు. 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా వర్గపోరు కలిచివేస్తోంది. BRSనుంచి ఎమ్మెల్సీ విఠల్, మాజీ MLAలు కోనప్ప, సక్కుల చేరికతో కాంగ్రెస్‌లో బలం పెరిగినా సీనియర్లకు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఇక ASFలో MLA కోవ లక్ష్మి క్యాడర్‌ను కాపాడుకుంటూ పని చేసుకుంటున్నారు. సిర్పూర్ MLA హరీశ్‌బాబు స్థానికంగా ఉండడనే విమర్శలున్నా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి వెళ్తోంది.
Similar News
News March 14, 2025
గ్రూప్-3 ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తోంది. మూడు రోజుల క్రితం గ్రూప్-1, రెండు రోజుల కిందట గ్రూప్-2 రిజల్ట్స్ ఇవ్వగా తాజాగా గ్రూప్-3 ఫలితాలు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మాస్టర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 2.69 లక్షల మంది హాజరయ్యారు.
Results PDF: <
News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.