News March 13, 2025
కౌటాల: బావిలో యువకుడి మృతదేహం

మద్యానికి బానిసై యువకుడు మృతి చెందిన ఘటన కౌటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని మొగడ్‌ధగడ్‌కు చెందిన ఉర్వత్ దౌలత్ (26) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం గ్రామ సమీపంలోని బావిలో అతడి మృతదేహం లభించింది. తల్లి నిర్మల భాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
KNR: బాలికతో వివాహం.. కేసు నమోదు: ఎస్‌ఐ

KNR(D) శంకరపట్నం మండలంలో ఓ బాలికకు బాల్య వివాహం చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చెన్నూరి పద్మ ఇచ్చిన పిటిషన్ మేరకు, ముద్రవేణి సంపత్, శోభల కుమారుడు ముద్రవేణి రాజ్ కుమార్‌కు బాలికతో చట్టవిరుద్ధంగా వివాహం నిర్వహించారు. దీంతో బాలిక తల్లిదండ్రులపై, సంపత్, శోభా, రాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2026
రొద్దంలో గ్యాస్ గోదాము తనిఖీ

రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదామును జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిల్వలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. డోర్-టు-డోర్ డెలివరీ విధానాన్ని పరిశీలించి వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి అందుతున్నాయా అని తెలుసుకున్నారు.
News March 14, 2026
సిద్దిపేట: ‘సమాజ దిశ మార్చేది కవిత్వమే’

సమాజంలోని రుగ్మతలను తొలగించి, సరైన దిశానిర్దేశం చేసే శక్తి కవిత్వానికే ఉందని ప్రముఖ కవి కోడం పవన్ కుమార్ అన్నారు. సిద్దిపేటలో ‘వెన్నెల సాహితీ సంఘం’ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న అసహనం ప్రమాదకరమని, దీనిని చక్కదిద్దాల్సిన బాధ్యత కవులదేనని పేర్కొన్నారు. పాలకుల లోపాలను నిర్మొహమాటంగా ప్రశ్నించే ధైర్యం కవులకే ఉంటుందన్నారు. యాదగిరి, అశోకరాజు తదితరులు పాల్గొన్నారు.


