News March 13, 2025

IPLలో ఆ రూల్ మారిస్తే బాగుంటుంది: శాంసన్

image

రాజస్థాన్ రాయల్స్ నుంచి బట్లర్‌ను రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ డెసిషన్ అని ఆ టీమ్ కెప్టెన్ శాంసన్ తెలిపారు. ఏడేళ్లుగా అతనితో కలిసి ఆడానని, తన క్లోజ్ ఫ్రెండ్స్‌లో అతనూ ఒకరని పేర్కొన్నారు. ఒకవేళ తనకు అవకాశం వస్తే IPLలో మూడేళ్లకోసారి ప్లేయర్లను రిలీజ్ చేసే రూల్‌ను మారుస్తానని చెప్పారు. ఇలా ప్లేయర్లను రిలీజ్ చేయడం వల్ల వారి మధ్య కనెక్షన్ పోతుందన్నారు. కాగా బట్లర్ ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడనున్నారు.

Similar News

News March 29, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

image

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.

News March 29, 2026

కాంగ్రెస్ పాలనలో స్కాములపై విచారణ జరిపించండి: BRS

image

TG: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని BRS ఆరోపించింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని CM రేవంత్‌కు BRSLP లేఖ రాసింది. 20 స్కాముల పేర్లను లేఖలో పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని CM రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

News March 29, 2026

NBK111.. పవర్‌ఫుల్ రోల్‌లో లక్ష్మీరాయ్?

image

గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో లక్ష్మీరాయ్ నటించనున్నట్లు సమాచారం. ఇదొక పవర్‌ఫుల్ రోల్ అని, ఆమె ఎంట్రీతోనే కథ మలుపు తిరుగుతుందని టాక్. బాలయ్య-లక్ష్మీ కాంబినేషన్‌లో ‘అధినాయకుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కాగా NBK111 చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి హీరోతో గోపీచంద్ రూపొందించే చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.