News March 13, 2025
HYD: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన రంగరాజన్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతిని శేష వస్త్రంతో ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామరాజ్యం పునఃస్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు.
Similar News
News March 7, 2026
విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కౌశిక్ రెడ్డి, అచ్యుత్ సాయి, రేవంత్, సాయి వివేక్ తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏసీపీ దామోదర్ వెల్లడించారు. వీరి నుంచి 19.70 గ్రాముల MDMA డ్రగ్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News March 7, 2026
విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News March 7, 2026
కామారెడ్డి: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన ఇమ్యునైజేషన్ అధికారి

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో HPV వ్యాక్సిన్ ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.రోహిత్ RMO డా.సంతోష్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని సంబంధిత గదులను పరిశీలించారు. వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్ణీత వయసు కలిగిన బాలికలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


