News March 13, 2025

రెడ్డిగూడెం: గేదెలను తప్పించబోయి ప్రమాదం

image

రెడ్డిగూడెంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అన్నేరావుపేట తండాకు చెందిన కూలీలు పనికి వెళ్లి తిరిగి వస్తుండగా రాయుడుపాలెం వద్ద గేదలను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కుమారి (30) మృతి చెందగా మరో ఇద్దిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

image

డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ Xలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఢిల్లీని తమిళనాడు ఓడించిందన్నారు. ఏప్రిల్ 23న ఢిల్లీ పొగరును, దానికి మద్దతు ఇస్తున్న బానిసలను ఓడిస్తామని పేర్కొంటూ తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థులైన బీజేపీ, AIADMKకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగలబెడుతున్న ఫొటోనూ ఈ పోస్ట్‌తో పాటు షేర్ చేశారు.

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్ చట్టం యథాతథం.. అమలు బిల్లే వీగింది

image

చట్టసభల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లకు సంబంధించి 2023లో పార్లమెంటు ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లును పాస్ చేయగా రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. డీలిమిటేషన్‌తో LS స్థానాలు 850కి పెంచి ఆ చట్టం అమలు చేసేందుకు GOVT ఇవాళ 131వ రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. ఉమెన్ రిజర్వేషన్ చట్టం యథాతథంగా ఉంటుంది. అందుకే రిజర్వేషన్ అమలు బిల్లును భవిష్యత్తులో ప్రవేశపెడతామని రిజిజు ప్రకటించారు.

News April 17, 2026

అనాతవరంలో 20 ఏళ్ల విద్యుత్ సమస్యకు పరిష్కారం: కలెక్టర్

image

అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గత 20 ఏళ్లుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, వైర్లను తొలగించి బయటి ప్రాంతానికి మార్చినట్లు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పి.గన్నవరం పాఠశాలలో విద్యార్థిని మరణం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలల ఆడిట్ నిర్వహించగా ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. 300 మంది విద్యార్థుల శ్రేయస్సుకు యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కరించామన్నారు