News March 13, 2025

HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టా భూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 14, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.

News March 14, 2026

OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

image

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్‌కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్‌కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్‌కు బ్రేక్ వేశారు.

News March 14, 2026

కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

image

తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ కేటాయించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య చేసిన వినతికి కేంద్రం స్పందించింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు లేఖ ద్వారా రేక్స్ సమృద్ధిగా కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర అవసరాలు, బోగీల లభ్యత ఆధారంగా ధాన్యం రవాణా కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం రైల్వే ద్వారా రవాణా కానుందన్నారు.