News March 23, 2024

NZB: BREAKING.. నీట మునిగి ఆరో తరగతి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. పట్టణంలోని అలీసాగర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి మోసిన్(13) ప్రమాదవ శాత్తు నీట మునిగి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 4, 2026

టర్కీలో గుండెపోటుతో వేల్పూర్ వాసి మృతి

image

వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. బతుకుతెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

News January 3, 2026

297 మంది తెలుగు యువతకు విముక్తి: ఎంపీ అరవింద్

image

నకిలీ ఉద్యోగాల పేరిట థాయిలాండ్, మయన్మార్‌లలో చిక్కుకున్న 297 మంది తెలుగు యువతను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా రక్షించింది. ఎంపీ అరవింద్ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించగా విదేశాంగ శాఖ స్పందించింది. మొత్తం 2,545 మంది భారతీయులు అక్రమ రవాణాకు గురికాగా, రాయబార కార్యాలయాల చొరవతో ఇప్పటివరకు 2,390 మందిని రక్షించినట్లు కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 297 మంది సురక్షితంగా విముక్తి పొందారు.

News January 3, 2026

నిజాంసాగర్ కాలువకు రూ.1,500 కోట్లు ఇవ్వాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే

image

నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ పూడికతో అధ్వానంగా మారిందన్నారు. మదనపల్లి నుంచి ఫత్తేపూర్ వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం కాలిపోయిన మోటార్లను ఇంతవరకు మార్చలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం కనికరించాలన్నారు.