News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
Similar News
News March 13, 2025
₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

భారత్‌లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.
News March 13, 2025
గాయపడ్డ నటి.. నుదిటిపై 13 కుట్లు!

సీనియర్ నటి, ఎవర్‌గ్రీన్ బ్యూటీగా పేరొందిన భాగ్యశ్రీ గాయపడ్డారు. పికిల్‌బాల్ ఆడుతుండగా ఆమె నుదిటిపై లోతైన గాయం తగిలింది. దీంతో నుదిటిపై 13 కుట్లు పడ్డాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చివరగా ‘రాధేశ్యామ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటించారు.
News March 13, 2025
HNK: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పదో తరగతి వార్షిక పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నేడు హనుమకొండ హంటర్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల(ధర్మసాగర్)ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్, ఎంసెట్‌లకు దరఖాస్తు చేశారా అని కలెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.