News March 13, 2025
ఆధార్, మొబైల్ నంబర్‌తో ఓటరు కార్డు లింక్ అవ్వాలి: ఈసీఐ

ఓటర్ ఐడీ కార్డుల్ని ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. దీంతో పాటు జనన, మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ కంపల్సరీ కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునివ్వగా ఈసీఐ తాజా ఆదేశాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
Similar News
News March 13, 2025
కిడ్నీలను కాపాడుకుందామిలా

శరీరంలో మూత్రపిండాల పనితీరు చాలా కీలకం. వాటిని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. పంచదార, ఉప్పు, కొవ్వులు పరిమితంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. డీహైడ్రేషన్ కిడ్నీలకు ప్రమాదకరం. ఇష్టారాజ్యంగా ఔషధాల్ని వాడకూడదు. రక్తపోటు, మధుమేహం, క్రియేటినిన్ స్థాయులపై కన్నేసి ఉంచాలి.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
News March 13, 2025
ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT
News March 13, 2025
ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.