News March 13, 2025

కుబీర్: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.

Similar News

News January 2, 2026

Yum! డీల్.. McD, డొమినోస్‌కు గట్టి పోటీ

image

దేవయాని, సపైర్ సంస్థల విలీనంతో మెక్ డొనాల్డ్స్, డొమినోస్‌కు సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. USA కంపెనీ Yum!కి చెందిన KFC, పిజ్జా హట్‌లను దేశంలో దేవయాని, సపైర్ వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడీ $934 మిలియన్ల డీల్‌తో మెర్జర్ ప్రకటించాయి. దీంతో వీటికి మ్యాన్‌పవర్, కార్గో తదితర కాస్ట్ తగ్గి ఆఫర్స్ సహా కొత్త బై ప్రొడక్ట్స్‌తో ప్రత్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ కావచ్చు.

News January 2, 2026

మంచిర్యాల: ‘వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలి’

image

మంచిర్యాల కార్పొరేషన్ పరిధి 38వ డివిజన్ సున్నం బట్టి వాడాలో 40,100,20 ఫీట్ల రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి సుమన్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రజల వద్ద సంతకాల సేకరణ చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సరైన రహదారులు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

News January 2, 2026

సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ విదేశాల్లో వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారన్న వార్తలపై వైసీపీ కౌంటర్లు వేస్తోంది. ‘అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు’ అంటూ ట్వీట్లు చేసింది. వాళ్లు కనబడుటలేదు అంటూ పోస్టర్లు కూడా క్రియేట్ చేసింది. వారి వ్యక్తిగత పర్యటనపై గోప్యత ఎందుకని YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.