News March 13, 2025
వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్‌గల్ జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
Similar News
News November 12, 2025
HNK: మూడో రోజు.. మూడు జిల్లాల యువత సత్తా చాటారు!

హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మూడో రోజు మూడు జిల్లాల అభ్యర్థులతో ఉత్సాహంగా సాగింది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపికైన 623 మంది అభ్యర్థులు రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను పరీక్షించి, ఉత్తీర్ణులైన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు.
News November 12, 2025
VJA: నకిలీ మద్యం కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ మాజీమంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 26లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. సిట్ విచారణ తీరు దారి తప్పుతోందని జోగి రమేశ్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
News November 12, 2025
జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.


